కరోనా వారియర్స్ అంటూ చప్పట్లు కొట్టి అభినందించిన తమని.. నేడు రాష్ట్ర ప్రభుత్వం రోడ్డున పడేసిందని కాంట్రాక్టు సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ముందు బైఠాయించి కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు, ఎనస్తీషీయ సిబ్బంది, ల్యాబ్ టెక్నిషియన్లు నిరసన తెలిపారు. తక్షణమే తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్యశాలలో తమని విధులోకి తీసుకున్నారు. క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పి.. నేడు కాలపరిమితి ముగిసిందని ఉద్యగం నుంచి తొలగించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన తమకు ప్రభుత్వం ఇచ్చే బహుమతి ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి