రాజధాని అమరావతిలో నిర్మాణ సామగ్రిని చోరీ చేస్తున్న ముఠాను తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. లింగాయపాలెంలోని ఎన్సీసీ(NCC) నిర్మాణ సంస్థకు చెందిన క్యాంపులో నిర్మాణం కోసం ఉంచిన సుమారు రూ. 2 లక్షలు విలువైన సామగ్రిని చోరీచేసి పారిపోతుండగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. రాయపూడికి చెందిన ముగ్గురు సభ్యులను అరెస్టు చేశారు.
కొంత కాలంగా రాజధానిలో నిర్మాణ పనులకోసం ఉంచిన కంకర, ఇసుక, ఇతర సామగ్రిని అక్రమంగా తరలిస్తున్నారంటూ రైతులు, ఎస్సీ సంఘాలు ఆందోళన చేసిన నేపథ్యంలో పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ పెంచారు. శనివారం రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో రాయపూడికి చెందిన సయ్యద్ మాబు, అలీషహీద్, కొయ్యగూర వంశీలు ఇనుప గడ్డర్లను తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు తుళ్లూరు సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండి: