రాజధాని అమరావతి ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున జాతీయ స్థాయిలో విస్తృతం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు మస్తాన్ వలీ స్పష్టం చేశారు. మూడు రాజధానులపై ఎన్నికలకు ముందు ఏనాడు చెప్పని జగన్...ఇప్పుడు మూడు రాజధానులంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని అమరావతిని నిర్వీర్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉరుకోదని..,ఈ సమస్యపై మరింత ఉద్యమిస్తామని చెప్పారు.
రాజధాని అమరావతిపై చేపట్టాల్సిన కార్యచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి జగన్కు వినిపించేందుకు బయల్దేరితే...గృహ నిర్భంధం చేసి అనంతరం పోలీసు స్టేషన్కు తరలించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి మరీ ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
ఇదీచదవండి
కాంగ్రెస్ ర్యాలీ భగ్నం.. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అరెస్ట్