ETV Bharat / state

వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ.. 21 మందికి గాయాలు!

పల్నాడు జిల్లా కారుమంచిలో అర్ధరాత్రి వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణలో 13 మంది తెదేపా, వైకాపాకు చెందిన 8 మందికి గాయాలయ్యాయి. రెంట్ కోతలపై ప్రభుత్వాన్ని విమర్శించినందుకు వైకాపా వర్గం వారు పక్కా ప్రణాళికతో దాడికి పాల్పడ్డారని.. తెదేపాకు చెందిన బాధితులు ఆరోపిస్తున్నారు.

వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ
వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ
author img

By

Published : Apr 7, 2022, 3:57 PM IST

వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ

పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో నిద్రిస్తున్న తెదేపా వర్గం వారిపై.. వైకాపాకు చెందిన వ్యక్తులు.. రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ దాడిలో 13 మంది తెదేపా, 8మంది వైకాపాకు చెందిన వారికి గాయాలయ్యాయి. గాయపడిన వారంతా వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గోవర్థన్‌ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో 144 సెక్షన్‌ విధించినట్లు తెలిపారు. కరెంట్ కోతలపై ప్రభుత్వాన్ని విమర్శించినందుకు వైకాపా వర్గం వారు పక్కా ప్రణాళికతో దాడికి పాల్పడ్డారని.. తెదేపాకు చెందిన బాధితులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి: రూ.12వేల కోసం కుమారుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.