గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం రాజుపాలెంలో కమ్మ మల్లిఖార్జునరావు, నెప్పలి సాంబయ్య వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓటు వేసేందుకు వెళ్లిన సమయంలో వివాదం చెలరేగి.. ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో సాంబయ్య, ప్రకాశ్ అనే వ్యక్తుల తలలకు గాయాలయ్యాయి. రక్తంతో చొక్కాలు తడిసిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గొడవ సద్దుమణిగేలా చేశారు. క్షతగాత్రులను బాపట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయుడు మృతి