గుంటూరు జిల్లా తెనాలిలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్యం వివాదం నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పట్టణంలోని మూర్తి కొండయ్య వీధిలో నూనె కృష్ణమార్తి అనే వ్యాపారి దుకాణాన్ని మున్సిపల్ అధికారులు రెండు రోజుల క్రితం తొలగించారు. అయితే.. వైకాపా నేతల ఒత్తిడితో తమ భవనాన్ని కూల్చివేశారని కృష్ణమూర్తి ఆరోపించారు.
ఈ క్రమంలో కృష్ణమూర్తి దుకాణాన్ని పరిశీలించేందుకు వెళ్లిన తెదేపా బృందాన్ని వైకాపా శ్రేణులు అడ్డుకున్నారు. కూల్చివేసిన దుకాణం వద్దకు వెళ్లకుండా నిలువరించారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితలు నెలకొన్నాయి. ఇరువర్గాలను శాంతింపజేసేందుకు పోలీసు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎప్పుడూ ఎం జరుగుతుందో అని స్థానికులు భయంతో వనికిపోతున్నారు.
ఇదీ చదవండి: సలసల మండుతున్న వంట నూనె ధరలు... అల్లాడుతున్న సామాన్యులు