గుంటూరు జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా, ప్రాంతీయ, మండల స్థాయి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నగర ఆరోగ్య కేంద్రాల్లోని మొత్తం 140 కేంద్రాల్లో ఈ నమూనా కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ నెల రెండో తేదిన జిల్లాలో జరిగిన డ్రై రన్లో టీకా ఇచ్చే సమయంలో తలెత్తే ఇబ్బందులు, సాంకేతిక సమస్యలపై అధ్యయనం చేశారు. దీనితో పాటు విస్తృత స్థాయిలో వ్యాక్సినేషన్ చేపడితే ఏమైనా సమస్యలు తలెత్తుతాయా అన్న అంశంపై పరిశీలనకు ఈ డ్రై రన్ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీచదవండి.