లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వం తెల్లకార్డు ఉన్న వాళ్లకు 1000 రూపాయల సాయం ప్రకటించింది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు వాలంటీర్ నజీర్ బాషా... సయ్యద్ హలీమా వద్దకు వచ్చి వేయి రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని ఫొటో తీసుకుని పది రోజులు గడుస్తున్నా తమకు డబ్బు ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనుమానం వచ్చి ఆర్థిక సాయం విషయంపై అధికారులను కలవగా ఆమెకు ఆర్థిక సాయం అందినట్లు ఆన్లైన్లో కనిపిస్తోందని అధికారులు సమాధానం ఇచ్చారు. హలీమా తనకు వెయ్యి రూపాయలు అందలేదని నజీర్ బాషాపై అధికారులకు ఫిర్యాదు చేసింది. వెంటనే లబ్ధిదారునికి వాలంటీర్ వేయి రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కారణంగా... గ్రామస్థుల్లో ఆ వాలంటీర్ తీరుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఇదీ చూడండి: