గుంటూరు మల్లిఖార్జునపేట, శారద కాలనీలో కమీషనర్ చల్లా అనురాధ పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ద్యం, తాగునీటి సరఫరాను తనిఖీ చేశారు. పలుచోట్ల అపరిశ్రుభంగా ఉండటంతో వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం చేస్తే తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రహదారి వెంబడి నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించి ప్లాన్ ఉన్నది లేనిది తనిఖీ చేయించాలన్నారు. బిల్డింగ్ నిర్మాణం జరిగే సమయంలో రోడ్డుపై ఎవరికి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి