ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనాన్ని వ్యతిరేకిస్తూ.. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. దుగ్గిరాలలోని కేఎన్ జూనియర్ కళాశాల, కేఎంఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కళాశాల మైదానంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ రెండు కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులను.. ప్రభుత్వ కళాశాలలకు బదిలీ చేశారు.
రెండు కాలేజీల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే విద్యార్థులు 500 మందికి పైగా ఉన్నారు. దీంతో యాజమాన్యం కొందరు ప్రైవేటు అధ్యాపకులతో ప్రస్తుతం తరగతులు నిర్వహిస్తోంది. కాలేజీల విలీనాన్ని వెనక్కి తీసుకుని, తమకు ఇబ్బందులు లేకుండా చూడాలని విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: