AP Judicial Academy: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్నకాకాని వద్ద ఏర్పాటు చేయనున్న రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణ పనులను కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఉన్నత న్యాయస్థానం రిజిస్ట్రార్ హరిహరనాథ శర్మ పరిశీలించారు. ఈనెల 30న రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీనీ దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ ప్రారంభించినన్నారు. అనంతరం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న రాష్ట్ర జ్యుడీషియల్ ఆఫీసర్స్ కౌన్సిల్ లో జస్టిస్ చంద్ర చూడ్ పాల్గొంటారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ హైకోర్టు న్యాయమూర్తులు ఎప్పటికప్పుడు అకాడమీ నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. గురువారం సాయంత్రం నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఇతర అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి: