ETV Bharat / state

'ఇలాంటివి అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయండి' - lockdown in guntur

కరోనా కట్టడికి పలు జాగ్రత్తలతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు నగరంలో ఎన్టీఆర్ స్టేడియంలోని మార్కెట్ ద్వారం వద్ద కరోన క్రిమి సంహారక టన్నెల్​ను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ప్రారంభించారు.

Collector samul  started the Corona Preventive Tunnel in guntur
గుంటూరులో కరోన క్రిమిసంహారక టన్నెల్
author img

By

Published : Apr 7, 2020, 2:13 PM IST

గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రైతు బజారులోకి ముఖద్వారం వద్ద కరోనా క్రిమిసంహారక టన్నెల్​ ఏర్పాటు చేశారు. ఐటీసీ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా రసాయన టన్నెల్​ను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ప్రారంభించారు. రైతు బజార్​కి వచ్చే ప్రజలు ముఖద్వారం వద్ద తమ చేతులను శుభ్రపరుచుకుని... టన్నెల్ నుంచి లోపలికి వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాటుపై స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. ఇలాంటివి అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని.. ప్రత్యేకంగా నిత్యవసర వస్తువులు లభించే ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చూడండి:

'విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు మానుకుంటే మంచిది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.