గుంటూరు రెడ్‌జోన్‌లోని పేదలకు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ నిత్యావసర సరుకులు అందజేశారు. సాయి భాస్కర్ ట్రస్ట్, జనచైతన్య హౌసింగ్ వారు వీటిని పంపిణీ చేశారు. సుమారు 3వేల పేద కుటుంబాలకు వాలంటీర్ల ద్వారా కంటైన్మెంట్ జోన్లలో ఉండే పేదలకు ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా తమ సంస్థ తరపున 10లక్షలు అందజేసినట్లు సంస్థ ప్రతినిధి చైతన్య చెప్పారు.
ఇవీ చదవండి: అమ్మితే రూ.2.. కొనబోతే 20