గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన షేక్ రెహనా సుల్తానా, ఆజాద్‌ల కుమారుడు తొండూరు రెహజాద్ అహమ్మద్. ఈ బుడతడి వయసు రెండున్నర సంవత్సరాలు. ఈ చిచ్చర పిడుగు అంకెలు, కూరగాయలు, రంగులు, పండ్లు, శరీరభాగాలు, ఇంగ్లీషు పదాలను గుర్తించటంతో పాటు.. రకరకాల జంతువుల అరుపులు అనుకరించటం చేస్తున్నాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు వీడియోను రికార్డ్ చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సుకి పంపారు. ఇందుకుగాను చిన్నారికి ఆ సంస్థ వారు అప్రిషియేషన్ సర్టిఫికేట్, గోల్డ్ మెడల్, గుర్తింపు కార్డు, పెన్, కరెంట్ ఎడిషన్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సు 2021 పుస్తకంను పంపించారు. ఈమేరకు ఆ చిన్నారితో సహా తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్‌ను కలిసి బుడతడు సాధించిన విజయాన్ని తెలిపారు. కలెక్టర్ సైతం చిన్నారి చెబుతున్న పదాలను విని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. భవిష్యత్తులో మరింత ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ రెహజాద్ అహమ్మద్‌ను అభినిందించారు.
ఇదీ చదవండీ.. High Court: ఉపాధి హామీ పెండింగ్ నిధుల చెల్లింపుపై.. హైకోర్టులో విచారణ