గుంటూరు జిల్లా బాపట్లలో రోడ్డు విస్తరణలో భాగంగా దేవాదాయ శాఖకు చెందిన రామానుజ కూటమి భవనాలను ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ తొలగిస్తుండగా పైకప్పు కూలింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు కార్మికులు గాయాలయాలతో బయట పడటంతో పెను ప్రమాదమే తప్పింది. ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారందరూ కర్లపాలెం మండలం సత్యవతి పేటకు చెందిన కార్మికులు. అధికారులు భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ సంఘటన జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇవీ చదవండి: వైద్య పరికరాల వ్యాపారం పేరుతో టోకరా... నిందితుడు అరెస్టు