వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరల వివరాల గోడ పత్రికను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఆవిష్కరించారు. ఈ నెల 5వ తేదీ కల్లా రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో(ఆర్బీకే) వీటిని ప్రదర్శించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 2020-21 ఏడాదికి సంబంధించి మొత్తం 24 పంటలకు ధరలను ఈ గోడ పత్రికలో పేర్కొన్నారు.
కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూధన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: