CM reacts on Kerala bus accident: శబరిమల వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. ఏలూరు మండలం మాదేపల్లికి చెందిన 84 మంది భక్తులు రెండు బస్సుల్లో శబరిమలకు వెళ్లారు. అక్కడ మొక్కులు తీర్చుకుని తిరిగి వస్తుండగా కేరళలోని పథనంథిట్ట వద్ద ఉదయం 8 గంటలకు రెండింటిలో.. ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన బస్సులో 44 మంది ప్రయాణిస్తుండగా నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు అధికారులు తెలిపారు.
క్షతగాత్రులను కొట్టాయం వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం జగన్మోహన్‌రెడ్డి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. మిగిలిన యాత్రికులకు వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని.. సీఎంవో అధికారులను ఆదేశించారు. పథనంథిట్ట జిల్లా ఉన్నతాధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు సీఎంవో అధికారులు జగన్‌కు వివరించారు.
ఇవీ చదవండి: