ETV Bharat / state

పైలట్‌ ప్రాజెక్టు.. అంగన్వాడీ పిల్లలకు ప్లేవర్డ్‌ పాలు

CM Jaganmohan Reddy review: మహిళా శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీల్లో పిల్లలకు ప్లేవర్డ్‌ పాలు పంపిణీని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలని జగన్‌ ఆదేశించారు. మూడు విడతల్లో అంగన్వాడీల్లో నాడు-నేడు పనులు చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు, పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

CM Jaganmohan Reddy review
మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం
author img

By

Published : Jan 10, 2023, 7:48 PM IST

CM review on Women and Child Welfare Dept: అంగన్వాడీల్లో పిల్లలకు ఫ్లేవర్డ్ పాలను పంపిణీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. మూడు నెలల పాటు ప్రయోగాత్మకంగా అందించి తర్వాత పూర్తి స్థాయిలో ఫ్లేవర్డ్ పాలు పంపిణీ చేయాలని సూచించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో 63 సీడీపీఓ పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపిన సీఎం.. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. అంగన్వాడీలలో స్మార్ట్‌ టీవీల ద్వారా డిజిటల్‌ పద్ధతుల్లో బోధన చేసే అంశంపై ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.

63 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం పచ్చజెండా: మహిళా శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. స్త్రీ శిశు సంక్షేమశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు, పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 63 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం పచ్చజెండా ఊపిన సీఎం.. వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఆదేశించారు. అంగన్వాడీలలో జరుగుతోన్న నాడు–నేడు ప్రగతిపై చర్చించారు. దాదాపు 1500 కోట్లకు పైగా ఖర్చుచేయాలని, మూడు విడతల్లో నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు.

బాధ్యులు చేసి కచ్చితంగా చర్యలు: అంగన్వాడీలలో నిరంతర పర్యవేక్షణ ఉండాలన్న సీఎం.. పాలు, గుడ్లులాంటి ఆహారం పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉండకూడదన్నారు. వీటి పంపిణీపై సమగ్ర పర్యవేక్షణ,పరిశీలన ఉండాలన్నారు. సమగ్ర ఎస్‌ఓపీలు రూపొందించుకోవాలని, టెక్నాలజీ వాడుకోవాలని సీఎం ఆదేశించారు. పంపిణీలో ఎక్కడైనా లోపాలు ఉంటే సంబంధిత వ్యక్తులను బాధ్యులు చేసి కచ్చితంగా చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. సూపర్‌వైజర్లపైన పర్యవేక్షణ ఉండాలన్నారు. నూటికి నూరుశాతం పిల్లలకు పాలు పంపిణీ కావాలన్న సీఎం.. పిల్లలకు ప్లేవర్డ్‌ పాలు పంపిణీని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలన్నారు. మూడు నెలల తర్వాత పూర్తిస్థాయిలో ప్లేవర్డ్‌ మిల్క్‌ పంపిణీ కావాలని, ఈ మేరకు షెడ్యూల్‌ రూపొందించుకోవాలని సీఎం ఆదేశించారు.

డిజిటల్‌ పద్ధతుల్లో బోధన: అంగన్‌వాడీలలో బోధనపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. ఉత్తమ బోధనలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అంగన్వాడీలలో స్మార్ట్‌ టీవీల ద్వారా డిజిటల్‌ పద్ధతుల్లో బోధనపై ఆలోచనలు చేసి, ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. అంగన్వాడీల్లో పిల్లల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్, వార్డు క్లినిక్స్‌ ద్వారా పరిశీలన చేయించాలని సీఎం సూచించారు. వైద్యపరంగా ఎలాంటి చికిత్సలు అవసరమైనా ఆరోగ్యశ్రీని వినియోగించుకుని వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని జగన్ సూచించారు. తల్లి లేదా బిడ్డ రక్తహీనత, పౌష్టికాహారలోపం లాంటి సమస్యలతో బాధపడుతుంటే వాటిని నివారించడానికి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని జగన్ పేర్కొన్నారు.

తల్లులకు టేక్‌ హోం రేషన్‌ విధానం ఫిబ్రవరి 1 నుంచి అందరితోపాటు ఇచ్చే ఆహారం, మందులకు అదనంగా ఇవ్వాలన్నారు. దీనిపై ఎస్‌ఓపీలను తయారు చేయాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తో దీనికి పరిష్కారం చూపించాలని సూచించారు. తల్లులకు టేక్‌ హోం రేషన్‌ విధానంపై ఆలోచన చేయాలన్న సీఎం, దీనికోసం లోపాలకు తావులేని విధానాన్ని రూపొందించాలన్నారు. అంగన్వాడీలు, ప్రభుత్వ బడులలో బలహీనవర్గాలకు చెందిన పిల్లలే అధికంగా ఉంటారని, ఈ వర్గాలకు చెందిన పిల్లలకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. వారి పట్ల సానుకూల ధృక్పధంతో పని చేయాలన్న సీఎం, 10 నుంచి12 ఏళ్ల వయస్సులో మంచి బోధన అందించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. విద్య, వ్యవసాయం, వైద్య ఆరోగ్యం తరహాలో మహిళ, శిశు సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం ప్రాధాన్య కార్యక్రమంగా చేపట్టిందని సీఎం తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.