రాజధాని రైతులను ఉద్దేశించి శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ (ఎస్వీబీసీ) ఛైర్మన్ బాలిరెడ్డి పృథ్విరాజ్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై మాట్లాడాలే తప్ప... కులాల ప్రస్తావన సరికాదని స్పష్టం చేశారు. రైతులపై ఇష్టానుసారంగా మాడ్లాడటాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కులాలను ప్రస్తావిస్తూ... ఎవరినీ కించపరిచేలా మాట్లాడకూడదని సీఎం ఆదేశించినట్లు తెలిపాయి.
ఇదీ చూడండి: పృథ్వీ వ్యాఖ్యలపై పోసాని ధ్వజం