WELFARE SCHEME FUNDS : ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల్లో లబ్ధిపొందని వారికి నేడు ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. 2లక్షల 79 వేల 65 మంది లబ్ధిదారులకు 590 కోట్ల 91లక్షల రూపాయలను సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో ముఖ్యమంత్రి జమ చేయనున్నారు. సంక్షేమ పథకాల లబ్ధి అందని వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్నవారికి లబ్ధి చేకూర్చనున్నారు. జగనన్న చేదోడు, Y.S.R. మత్స్యకార భరోసా, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి, వైయస్సార్ కాపు నేస్తం సహా పలు పథకాలకు లబ్ధి చేకూర్చనున్నారు. కొత్తగా జూన్ 2022 నుంచి నవంబర్ 2022 వరకు అర్హులైన వారికి పెన్షన్ కార్డులు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రస్తుతం జరుగుతోందని ప్రభుత్వం తెలిపింది.
ఇవీ చదవండి: