ముఖ్యమంత్రి జగన్ ఈనెల 18న గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరులో అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 57వ వంటశాలను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం తాడేపల్లి మండలం కొలనుకొండ ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి జగన్ భూమి పూజ చేయనున్నారు.
ముఖ్యమంత్రి గుంటూరు పర్యటన దృష్ట్యా ఏర్పాట్లను మంత్రి శ్రీ రంగనాథరాజు, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పరిశీలించారు. జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు.. అక్షయ పాత్ర నిర్మించిన అధునాతన వంటశాలను సీఎం ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి: Controversies on Postings and Transfers : ముందు అందలం ఎక్కించి...ఆపై అవమానించి...