మోకాలి శస్త్ర చికిత్స చేయించుకున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును పరామర్శించేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని మధు నివాసానికి వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆయన్ను పరామర్శించారు.
ఇదీ చూడండి: 'సీపీఎం తరపున మరో స్వాతంత్య్ర పోరాటం'