ETV Bharat / state

వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికీ రాకూడదు: సీఎం జగన్‌ - ఆరోగ్యశ్రీ కార్డులపై సీఎం వీడియో కాన్ఫరెన్స్

CM Jagan Start Smart Arogyasri Cards Distribution: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంపై ముఖ్యమంత్రి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏడాదికి రూ.5 లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలకు 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతుందని తెలిపారు.

CM_Jagan_Start_Smart_Arogyasri_Cards_Distribution

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 18, 2023, 8:56 PM IST

CM Jagan Start Smart Arogyasri Cards Distribution: వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద ఇకపై 25 లక్షల రూపాయల వరకూ ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికీ రాకూడదనే ఉద్దేశంతో మార్పులు తీసుకువస్తూ ముందడుగు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో 3,257 ప్రొసీజర్లను విస్తరించడం సహా పరిమితిని పెంచుతున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీని 2,513 ఆస్పత్రులకు విస్తరించినట్లు తెలిపిన సీఎం జగన్ హైదరాబాద్‌లో 85, బెంగళూరులో 35, చెన్నైలో 16 ఆస్పత్రులకు విస్తరించినట్లు వెల్లడించారు.

ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపు ఆలస్యంపై స్పందించిన మంత్రి

Health Cards Distribution in AP: ఏడాదికి రూ.5 లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం(YSR Aarogyasri Smart Health Cards) వర్తిస్తుందని, ఈ మేరకు 1.4 కోట్ల కుటుంబాలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చినట్లు తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వివిధ మండల కార్యాలయాల అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ (CM Jagan Video Conference) నిర్వహించారు. ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ కార్డును ఇవ్వడమే కాకుండా, దీనిపై సేవలు ఎలా పొందాలనే వివరాలను వివరించాలని అధికారులకు సూచించారు. కనీసం ఒకరి ఫోన్లోనైనా ఆరోగ్యశ్రీ యాప్‌ (Aarogyasri App) ను డౌన్లోడ్​ చేయించి, రిజిస్ట్రేషన్‌ చేయించాలని నిర్దేశించారు.

ఏడాదికి రూ.5 లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ, పథకాన్ని 2,513 ఆస్పత్రులకు విస్తరించాం: సీఎం జగన్‌

Smart Aarogyasri Health Cards Distribution in AP: మార్పులు చేసిన ఫీచర్లతో కూడిన కొత్త ఆరోగ్య శ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. క్యూ ఆర్ కోడ్ (QR Code) ​తో కూడిన కార్డులో పలు కొత్త ఫీచర్లు ఉన్నట్లు సీఎం జగన్ తెలిపారు. దీనివల్ల పేషెంట్లకు సంబంధించిన అన్ని వివరాలు నిక్షిప్తమవుతాయని, దీంతో వైద్యులు సులభంగా వైద్యం అందించడానికి వీలవుతుందన్నారు. ఇవన్నీ ప్రతి ఇంటికి చక్కగా వివరించాలని, ఆరోగ్యశ్రీ కార్డు చేతిలో పెట్టిన తర్వాత దానికింద వైద్యసేవలు ఎలా ఉచితంగా పొందవచ్చో తెలియని వ్యక్తులు ఉండకూడదని సీఎం సూచించారు.

CM Jagan Orders on Health Cards Distribution in AP: ప్రతివారం మండలానికి నాలుగు గ్రామాలు చొప్పున కొత్త ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ, ప్రచారం కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. మహిళా పోలీసులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిశ యాప్‌(Disha App) ను కూడా డౌన్లోడ్‌ చేయించాలన్నారు. ప్రతి ఇంట్లో మహిళల ఫోన్లో ఆరోగ్యశ్రీ, దిశ యాప్‌లు ఉండాలన్నారు. ఈ రెండూ కచ్చితంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ హాస్పటల్స్‌కు బకాయిలు వెంటనే విడుదల చేయాలి: నారా లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.