CM REVIEW ON MUNICIPAL DEPARTMENT : వర్షాకాలం సహా అన్ని కాలాల్లోనూ రోడ్ల నిర్మాణం బాగుండేలా కొత్త టెక్నాలజీపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దీర్ఘకాలం మన్నే పద్ధతిలో రోడ్ల నిర్మాణం సాగేలా చూడాలన్నారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నగరాలు, పట్టణాల్లో కనీస సౌకర్యాలపై పర్యవేక్షించాలన్న ఆయన.. సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. మున్సిపల్ సర్వీసుల కోసం యాప్‌ను తీసుకురావాలని.. అది గ్రామాల్లోనూ అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి సూచించారు.
నిర్మాణాత్మక వ్యవస్థ కోసం యాప్ రూపొందిస్తున్నట్లు తెలిపిన అధికారులు.. రియల్‌టైం మానిటరింగ్‌తో 'ఏపీ సీఎం ఎంఎస్' యాప్ తెస్తున్నట్లు వెల్లడించారు. నెల రోజుల్లో యాప్ సిద్ధమవుతుందన్నారు. యాప్ ద్వారా గ్రీవెన్స్ పరిష్కార వ్యవస్థ బలోపేతంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. మున్సిపల్ సర్వీసులు పారదర్శకంగా ప్రజలకు అందాలన్నారు.
టౌన్ ప్లానింగ్ సహా.. ఇతరత్రా విభాగాల్లో సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌ను పరిశీలన చేయాలని సూచించారు. ప్రజలకు సత్వర సేవలు, నిర్దేశిత సమయంలోగా అనుమతులు, అవినీతి లేకుండా చూడటమే లక్ష్యంగా మార్పులు తీసుకురావాలన్నారు. సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ల్‌పై నిశిత సమీక్ష చేసి తగిన ప్రణాళికను రూపొందించాలని సీఎం ఆదేశించారు. రాజమహేంద్రవరంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటు నిర్మాణ ప్రతిపాదనకు సీఎం పచ్చజెండా ఊపారు.
ఇవీ చదవండి: