CM Jagan Review on Jagananna Arogya Suraksha: జగనన్న ఆరోగ్యసురక్షపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా అనే అంశంపై బ్రోచర్‌ను విడుదల చేశారు. జగనన్న ఆరోగ్య సురక్షపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. జగనన్న సురక్ష తరహాలోనే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రతి ఇంట్లో జల్లెడ పట్టి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కారమిచ్చే బాధ్యతను తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రతి ఇంట్లో ఏ సమస్యలున్నాయన్నది తెలుసుకుని విలేజ్ క్లినిక్ ద్వారా వాటిని పరిష్కరిస్తారని తెలిపారు. ఒక నిర్ణీత రోజున హెల్త్ క్యాంపు నిర్వహిస్తామన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అయిదు దశలలో జరుగుతుందని, సెప్టెంబరు 30 నుంచి హెల్త్ క్యాంపులు ప్రారంభమవుతాయని తెలిపారు. సెప్టెంబరు 15 నుంచి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిని జల్లెడ పట్టే కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. తొలిదశలో వాలంటీర్లు, గృహసారధులతో పాటు ప్రజాప్రతినిధులు ఈ ముగ్గురూ వెళ్లి ప్రతి ఇంటినీ సందర్శిస్తారని తెలిపారు.
CM Jagan Review On Chandrababu Arrest: సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష.. చంద్రబాబు కేసుపై ఏఏజీకి సూచనలు
ఆరోగ్య సురక్షా కార్యక్రమం జరగబోయే రోజు, నిర్వహించే కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తారని సీఎం చెప్పారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, రెగ్యులర్ మెడిసిన్ ఇవ్వడంతో పాటు వైద్యుడు వారిని పరీక్షించి.. తదుపరి చికిత్స అందిస్తారని తెలిపారు. రెండో టీంలో సీహెచ్‌ఓ నేతృత్వంలో ఆశావర్కర్, వాలంటీర్ వస్తారని తెలిపారు. ఇంటిలోనే 7 రకాల టెస్టులు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారని సీఎం వెల్లడించారు.
ఫేజ్–3లో మరోసారి ఓరియెంటేషన్ కార్యక్రమం ఉంటుందని, హెల్త్ క్యాంప్ జరగబోయే 3 రోజుల ముందు వాలంటీర్, గృహసారధులు, ప్రజా ప్రతినిధులు ఆ గ్రామంలో మరోసారి గుర్తు చేస్తారని, అందుబాటులో ఉండాలని చెప్తారని వెల్లడించారు. ఫేజ్ 4లో హెల్త్ క్యాంపు నిర్వహిస్తారన్న సీఎం.. ప్రతి మండలంలో ఒక రోజు హెల్త్ క్యాంపు ఉంటుందని, 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తారన్నారు.
పట్టణాల్లో అర్భన్ హెల్త్ క్లినిక్స్‌ను ఒక యూనిట్‌గా తీసుకుని హెల్త్ క్యాంపు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో నలుగురు డాక్టర్లు పాల్గొంటారు. ఇందులో ఇద్దరు డాక్టర్లు పీహెచ్‌సీల నుంచి పాల్గొంటారన్నారు. ఈ టెస్టుల రిజల్ట్ ఆధారంగా.. మొబైల్ యాప్‌లో సేకరించిన డేటాను అప్‌డేట్ చేస్తారని, ఆ తర్వాత ప్రతి ఇంటికి, పేషెంట్‌కి ఒక కేష్ షీట్ జనరేట్ అవుతుందని, ఈడేటా హెల్త్ క్యాంపు జరిగే నాటికి ఉపయోగపడుతుందన్నారు.
ఒక్కసారి పేషెంట్లను గుర్తించిన తర్వాత.. వారికి సంబంధించి పీరియాడికల్ టెస్టింగ్, కన్సల్టేషన్, పీరియాడికల్‌గా మందులు ఇవ్వడం అనేది ఈ కార్యక్రమంలో ప్రధాన అంశమన్నారు. మందులు లేవు, దొరకడం లేదు అన్న మాట వినిపించకూడదని, ఫ్యామిలీ డాక్టర్ విలేజ్ క్లినిక్కుల ద్వారా బాధ్యత తీసుకోవాలన్నారు.