CM Jagan Review meeting with officials on YSR Aarogyasri scheme: ఆరోగ్య శ్రీపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆరోగ్య శ్రీ నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్స అందించే కార్యక్రమానికి సీఎం జగన్ డిసెంబర్ 18వ తేదీన ప్రారంభించనున్నారు. జనవరి నెలాఖరు నాటికి ఇంటింటికీ ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.
ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపు ఆలస్యంపై స్పందించిన మంత్రి
ఆరోగ్య శ్రీ కార్డు ఉంటే 25 లక్షల వరకూ వైద్యం ఉచితం: ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స అందించే కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 18వ తేదీన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం స్పష్టం చేశారు. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ.25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు సీఎం సమీక్షలో వ్యాఖ్యానించారు. ఆరోగ్య శ్రీ కార్డు ఉంటే 25 లక్షల వరకూ వైద్యం ఉచితంగా లభించే అవకాశముందని తెలిపారు. మరోవైపు ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారికి మరోమారు చెకప్ కోసం డాక్టర్ కన్సల్టేషన్ కింద రూ.300 చెల్లించాలని సూచించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే స్పెషలిస్టు డాక్టర్లకు అవసరమైన చోట క్వార్టర్లను నిర్మించాలని సీఎం ఆదేశించారు. అందుకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. జనవరి నెలాఖరు నాటికి ఇంటింటికీ ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. మరోవైపు జనవరి 1వ తేదీ నుంచి ఆరోగ్య సురక్ష రెండోదశ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు అందుతున్న వైద్య సేవలు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
ఆరోగ్య శ్రీ నిధులపై ఆరోగ్యశాఖకు ఏపీ ప్రైవేటు హస్పిటల్స్ ఆసోషియేషన్ లేఖ
అందరి ఫోన్లలో ఆరోగ్య శ్రీ యాప్: ప్రతి ఒక్కరూ తమ ఫోన్లలో ఆరోగ్య శ్రీయాప్ నూ డౌన్ లోడ్ చేసేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఆరోగ్య శ్రీ యాప్‌ను ఎలా వినియోగించుకోవాలో తెలియని వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదన్నారు. ఆరోగ్య శ్రీ చికిత్స కోసం వెళ్లే రోగులకు ప్రయాణ ఛార్జీలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ప్రతి ఒక్కరి ఫోన్‌లో కూడా ఆరోగ్య శ్రీ యాప్‌ని డౌన్లోడ్ చేయాలని, దీనివల్ల పర్యవేక్షణ మరింత సులభతరం అవుతుందన్నారు. క్యాంపులకు స్పెషలిస్టులను పంపే విషయంలో మరింత శ్రద్ధ వహించాలని సీఎం జగన్ సూచించారు.
ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ హాస్పటల్స్‌కు బకాయిలు వెంటనే విడుదల చేయాలి: నారా లోకేశ్