ETV Bharat / state

అవుకు - టముకు! ముందు రిబ్బన్​ కటింగ్​ - ఆ తర్వాతే పనులు పూర్తి ! అవుకు టన్నెల్​ను ప్రారంభించనున్న సీఎం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 10:05 AM IST

Cm Jagan Opening OWK Tunnel: పనులు పూర్తయ్యాక ప్రారంభోత్సవాలు చేస్తారు.! కానీ జగనన్నరూటే రివర్స్‌ టెండరింగ్‌ కదా! అందుకే ముందు రిబ్బన్‌ కటింగ్‌ చేసి ఆ తర్వాత పనులు పూర్తి చేయాలనుకుంటున్నారు.! అసంపూర్తిగా ఉన్న అవుకు టన్నెల్‌ ప్రారంభోత్సవం అంటూ.. గొప్ప ప్రదర్శన ఇవ్వబోతున్నారు. నాలుగున్నరేళ్లు మాటలగారడీ చేసిన సీఎం.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార బురిడీకి తెరతీశారు.

cm_jagan_opening_owk-_tunnel
cm_jagan_opening_owk-_tunnel

Cm Jagan Opening OWK Tunnel: అవుకు టన్నెల్​ ప్రారంభోత్సవానికి శిలాఫలకాలు సిద్ధం చేస్తున్నారు. ప్రారంభోత్సవ పనులు పూర్తి చేస్తున్నారు. మరి ప్రాజెక్టు పూర్తైందా.. పూర్తికాకుండా ప్రారంభోత్సవం ఎలా చేస్తారంటారా అని మీ ప్రశ్న.. వేరేవాళ్ల సంగతేమోగానీ మన సీఎం జగన్‌ చేస్తారు. అది అంతే. ఎవరేమనుకున్నా ఆయన రిబ్బన్ కటింగ్‌ చేసి తీరుతారు. బుధవారం అవుకు టన్నెల్‌ వద్ద జరగబోయేది ఇదే.

నాలుగేళ్లుగా పనుల్లో కనిపించని వేగం.. ప్రచార వ్యూహంలో కనిపిస్తోంది. దానికి నిదర్శనమే ఈ ప్రారంభోత్సవ హడావుడి. అవుకు టెన్నెల్‌.. పనులు పూర్తికాకుండానే ప్రారంభించేందుకు జగన్‌ సిద్ధం అవడం విమర్శలకు తావిస్తోంది. ఇంతకీ అవుకు టన్నెల్‌ పనులు ఎందాకొచ్చాయో.. ఇప్పుడు తెలుసుకుందాం.

నంద్యాల, కడప జిల్లాల్లో ఈ నెల 30న సీఎం జగన్ పర్యటన - అవుకు సొరంగం నుంచి నీటి విడుదల

వైఎస్సార్​ జిల్లా గండి కోట జలాశయానికి నీళ్లు తీసుకెళ్లడంలో అవుకు టన్నెల్‌ కీలకమైనది. శ్రీశైలం జలాలు ఎస్​ఆర్​బీసీ ద్వారా గోరకల్లు జలాశయానికి.. అక్కడి నుంచి గాలేరు - నగరి వరద కాలువ తవ్వి అవుకు టన్నెల్‌కు తరలించాల్సి ఉంటుంది. చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రణాళికలు వేస్తే 2008లో వైఎస్​ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. 2009లోఆగిపోయాయి. మళ్లీ 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక పనులు జోరందుకున్నాయి.

సుమారు 401 కోట్ల రూపాయల అంచనాతో ఎన్​సీసీ, మైటాస్‌ సంస్థలు పనులు చేపట్టాయి. 12 మీటర్ల ఎత్తు, 12 మీటర్ల వెడల్పున 5.6 కిలోమీటర్ల మేర.. కొండలను తొలిచి రెండు సొరంగా తవ్వాలి. ఒక సొరంగం తవ్వుతుండగా సుమారు 280 మీటర్లకుపైగా ఫాల్ట్‌ జోన్‌ రావడంతో.. పనులు చేసే పరిస్థితి లేక ఆపేశారు. రెండో సొరంగ మార్గంలోనూ 165 మీటర్లకుపైగా ఫాల్ట్‌ జోన్‌ రావడంతో ప్రణాళికలు మార్చారు.

పోలీసులకు అడ్డుపడి విడిపించుకుని తీసుకెళ్లారు - ఎస్​ఐపై ఎలాంటి దాడి జరగలేదు : డీఎస్పీ శ్రీనివాసులు

రెండో సొరంగ మార్గాన్నే రెండు చిన్న సొరంగాలుగా మార్చి.. ఒక్కో దానిలో 10 వేలక్యూసెక్కులు తరలించాలని నిర్ణయించారు. 2018-19లో ఒక సొరంగం పూర్తిచేసి 10 వేల క్యూసెక్కులు పంపారు. రెండో సొరంగంలో 180 మీటర్ల ఫాల్ట్ జోన్‌, లైనింగ్ పని మాత్రమే మిగిలింది. ఈలోపే జగన్‌ గద్దెనెక్కారు. రివర్స్ టెండరింగ్‌ పేరుతో పనులు ఆపేశారు. కాంట్రాక్టర్‌ను మార్చారు. మిగిలిన పనులు మ్యాక్స్‌ కన్స్ట్రక్షన్‌కు కట్టబెట్టారు.

కానీ నిధులు మాత్రం సకాలంలో ఇవ్వలేదు. అందుకే లైనింగ్‌ పనులు నేటికీ పెండింగ్‌లో ఉన్నాయి. అవుకు టన్నెల్‌లో ఇంకా 30 కోట్ల విలువైన పనులు పెండింగ్‌లో ఉండగా కాంట్రాక్టర్‌కు 24 కోట్ల రూపాయల వరకూ బిల్లులు బకాయిలు పెట్టినట్లు తెలుస్తోంది. వాస్తవ పరిస్థితి ఇదైతే.. జగన్‌ మాత్రం అదిగో అవుకు ఇదిగో శిలాఫలకం అంటూ ప్రారంభోత్సవానికి సిద్ధం అయ్యారు.

నత్తనడకన అవుకు, వెలిగొండ టన్నెల్‌ పనులు.. గడువులోగా పూర్తవటం కష్టమే..!

సొరంగంలో లైనింగ్‌ పనులు చేయాల్సింది ఇంకో 150 మీటర్లమేరేనని అదికారులు చెప్పుకొస్తున్నారు. కానీ, దాదాపు వెయ్యి మీటర్ల వరకూ పెండింగ్‌ ఉందని అంచనా. లోపలికి వెళ్లి వాస్తవాన్ని చూసేందుకు పత్రికా ప్రతినిధుల్ని అధికారులు అనుమతించడంలేదు. నీళ్లు మళ్లించినప్పుడు ఫోటోలు తీసుకోండని దాటవేస్తున్నారు. సొరంగం వందకు వందశాతం పూర్తైతే.. ఈ దాపరికం ఎందుకనే ప్రశ్నకు ఎవరూ నోరు మెదపడం లేదు.

తానే సీఎంగా ఉంటే అవుకు టన్నెల్‌ ఎప్పుడో పూర్తయ్యేదంటూ.. ప్రతిపక్ష నేతగా జగన్‌ ప్రగల్భాలు పలికారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2020-21లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల జాబితాలో అవుకు టన్నెల్‌నూ చేర్చారు. కానీ పదవీకాలం పూర్తి కావస్తున్నా.. సొరంగం పనులు పూర్తిచేయలేదు.

ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండే సరికి.. పనులు పూర్తికాకపోయినా.. ప్రారంభోత్సవం పూర్తిచేద్దామనే నిర్ణయానికి వచ్చారు. పూర్తికాని పనుల్ని పూర్తైనట్లు చూపేందుకు నానా తంటాలు పడుతున్నారు. గోరకల్లు నుంచి 2 టన్నెళ్ల ద్వారా 20 వవేల క్యూసెక్కులు అవుకు జలాశయానికి చేరుస్తారు. వాటిని ఫోటోలు తీసి.. అవుకు టన్నెల్‌ ప్రారంభించాం అని ప్రచారం చేసుకోబోతున్నారు. కానీ నిరంతరం నీటిని తరలించరు.. నీళ్లు బంద్‌పెట్టి సొరంగంలో మిగిలిన లైనింగ్ పనులు చేసి.. వచ్చే వర్షాకాలానికి సిద్ధం చేస్తారు. ప్రస్తుతానికైతే అవుకు టన్నెల్‌ పూర్తి చేసేశాం అని.. డప్పు వేసుకుంటారు.

Avuku Tunnel Project Progress: ప్రతిపక్ష నేతగా గొంతెత్తిన జగన్.. అధికారం చేపట్టాక చేతులెత్తేశాడు!

ముందు రిబ్బన్​ కటింగ్​ - ఆ తర్వాతే పనులు పూర్తి - అవుకు టన్నెల్​ పనుల్లో ప్రభుత్వ తీరిది​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.