CM Jagan on Krishna water disputes: కృష్ణా జలాల పునః సమీక్ష చేసేందుకు కేంద్రం మార్గదర్శకాల గెజిట్ వెలువరించిన దృష్ట్యా... దీనిపై అభ్యంతరం తెలుపుతూ ప్రధాన మంత్రి, హోం మంత్రికి మరోమారు లేఖలు రాయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. కృష్ణా నదీ జలాలపంపిణీ పై రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్లాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ వద్దని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. జలవనరుల శాఖ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రానికి జరిగే నష్టంపై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం: కృష్ణాజలాలపై కేంద్రం తాజా విధివిధానాల జారీ చేసి దృష్ట్యా వీటిపై సమావేశంలో చర్చించారు. జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, పాల్గొన్న జలవనరులశాఖ ఈఎన్‌సీ సి నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కృష్ణా జలాల పునః సమీక్ష ద్వారా రాష్ట్రానికి జరిగే నష్టంపై సీఎంకు అధికారులు వివరించారు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపైనా సమగ్రంగా చర్చించారు. కృష్ణా నదీజలాల పంపిణీపై గతంలో ఇచ్చిన కేటాయింపులపై సమగ్రంగా చర్చించారు. కృష్ణా నీటి వివాదాల ట్రిబ్యునల్ (KWDT-2) తీర్పుద్వారా మిగులు జలాల కేటాయింపుల్లోనూ నష్టం జరుగుతోందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అధికారులు తెలిపారు. కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించేలా ఉందన్న అధికారులు...ఎపీఆర్ ఎ సెక్షన్ 89 లో పేర్కొన్న అంశాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందన్నారు.
JAGAN LETTER: ప్రధాని మోదీ, కేంద్ర జల్‌శక్తి మంత్రికి సీఎం జగన్ లేఖలు
ఏపీ వాటాలపై మౌనం: ఇప్పటికే సుప్రీంకోర్టు లో పిటిషన్లు పెండింగ్ ఉండగా గెజిట్ విడుదల చేశారని సీఎంకు వివరించారు. అంతర్ రాష్ట్ర నదీజల వివాదాల చట్టంలోని క్లాజ్ 4 ను సైతం ఉల్లంఘించి ఈ విధివిధానాలు జారీ చేశారని సీఎంకు తెలిపారు. ట్రైబ్యునల్ కేటాయింపులు, పంపకాలను పునఃపరిశీలించరాదని చట్టం చెప్తున్నా... దానికి విరుద్ధంగా కేంద్రం విధివిధానాలు చేసిందని అధికారులు సీఎంకు తెలిపారు. అదే తెలంగాణ 214 టీఎంసీలు తరలిస్తున్నా, ఆ మేరకు ఏపీ వాటాలపై మౌనం విధివిధానాల్లో వహించడంపైనా సమావేశంలో చర్చించారు. అలాగే గోదావరి నదీజలాల కేటాయింపుల్లో ఇంకో బేసిన్‌కు తరలించుకోవచ్చన్న వెసులుబాటుతో, పోలవరం నుంచి ఎపీ తరలించే నీటిని పరిగణలోకి తీసుకుని ఆమేరకు తెలంగాణకు కృష్ణానదిలో అదనపు కేటాయింపులు చేయడం సమంజసం కాదని వెల్లడించారు. ఇది రాష్ట్రానికి నష్టమని తెలిపిన అధికారులు తెలిపారు. వీటన్నింటిపై అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించారు. అధికారుల సూచనలు సలహాలు తీసుకున్న సీఎం జగన్.. జరుగుతున్న అన్యాయంపై కేంద్రం దృష్టికి తీసుకురానున్నారు.