ETV Bharat / state

CM Jagan: రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచేలా పని చేయాలి: సీఎం జగన్​ - ఆదాయ శాఖలపై సమీక్ష సమావేశం

CM Review Meeting : రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచేలా పనిచేయాలని.. పలు శాఖల ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించి సమర్థంగా అమలు చేయాలని సూచించారు. అవినీతిని తగ్గించి.. పారదర్శకత పెంచేలా పలు చర్యలు తీసుకోవాలన్న సీఎం.. వచ్చే సమీక్ష సమావేశం నాటికి మంచి మార్పులు కనిపించాలని నిర్దేశించారు. అవినీతి నిరోధక శాఖను క్రియాశీలకంగా ఉంచాలని సీఎం ఆదేశించారు..

cm review
cm review
author img

By

Published : Apr 21, 2023, 10:46 PM IST

Updated : Apr 22, 2023, 6:13 AM IST

CM Review Meeting On Income Generated Departments : ఆదాయాన్ని ఆర్జించే శాఖలతో ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఏ మేర లక్ష్యాలను చేరుకున్నామనే విషయమై.. సీఎంకు వివిధ శాఖల అధికారులు నివేదిక అందించారు. అదే సమయంలో ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు. ఆదాయార్జన పెంచాలని సీఎం జగన్‌ వివిధ శాఖల ఉన్నతాధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. ఈ ఏడాది గనుల శాఖలో 6 వేల కోట్లు, రవాణాశాఖలో 7 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది పలు శాఖల ద్వారా ఖజానాకు ఆదాయం, లక్ష్యాలను వెల్లడించిన ముఖ్యమంత్రి కార్యాలయం.. మద్యం ద్వారా ఎంత ఆదాయం వచ్చింది.. ఈ ఏడాది లక్ష్యం ఎంతనే వివరాలను వెల్లడించలేదు. ఆదాయాన్ని పెంచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం పలు ఆదేశాలిచ్చారు.

మత్తు పదార్థాలపై దృష్టి పెట్టాలి : రిజిస్ట్రేషన్లు, టౌన్‌ ప్లానింగ్‌ విభాగాలు, మండల కార్యాలయాలు, గ్రామవార్డు సచివాలయాలు సహా ఇతర చోట్ల కూడా ఎక్కడా అవినీతికి తావు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సేవలు అందించడంలో అత్యంత పారదర్శకంగా ఉండాలన్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలన్నదానిపై.. ఏసీబీ నంబర్లను ఆయా కార్యాలయాల్లో ప్రముఖంగా కనిపించేలా హోర్డింగులు ఉంచాలన్నారు. మానవ ప్రమేయాన్ని తగ్గించి.. పారదర్శకతను పెంచే సాంకేతిక విధానాలపై అధ్యయనం చేసి.. వాటిని అమలులోకి తీసుకురావడంపై దృష్టి సారించాలన్నారు. వచ్చే సమీక్ష సమావేశం నాటికి మంచి మార్పులు కనిపించాలని అధికారులకు సీఎం సూచించారు. అవినీతి నిరోధక శాఖను క్రియాశీలకంగా ఉంచాలన్న సీఎం మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాలను నివారించడానికి.. వాటి పంపిణీని అడ్డుకోవడానికి అధికారులు గట్టి దృష్టి పెట్టాలని ఆదేశించారు. యూనివర్సిటీలు, కళాశాలలు, విద్యాసంస్థల వద్ద కచ్చితంగా టోల్‌ ఫ్రీ నంబర్ ఉండేలా హోర్డింగ్స్‌ ఉంచాలన్నారు. డ్రగ్స్ నివారణ కార్యక్రమాలు, టోల్‌ ఫ్రీ నంబర్‌ పనితీరుపై ప్రతి జిల్లాలో.. 15 రోజులకోసారి మాక్‌ డ్రిల్ చేపట్టాలని సీఎం ఆదేశించారు. రవాణాశాఖలో మెరుగైన విధానాలు తీసుకురావాలన్న సీఎం దీనిపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.

వాణిజ్య పన్నుల ఆదాయంలో వృద్ధి : సమీక్ష సమావేశంలో ఆయా శాఖలు గత ఏడాది సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రికి వివరించారు. గత ఏడాదితో పోలిస్తే వాణిజ్య పన్నుల ఆదాయ వృద్ధిలో ఏపీ మెరుగైన పనీతీరు కనబర్చిందని సీఎంకు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్రల కంటే మెరుగైన స్థానంలో రాష్ట్రం ఉందన్నారు. గత ఏడాదితో పోలిస్తే కర్ణాటకలో 27.51 శాతం, మహారాష్ట్రలో 24.4 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 25.29 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపారు. 2022-23లో రాష్ట్రంలో వాణిజ్య పన్నుల ఆదాయం.. 51 వేల 481 కోట్లు ఉందని 93.24 శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. 2023-24లో 60 వేల 191 కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. లీకేజీలను అరికట్టి సమగ్ర పర్యవేక్షణలద్వారా లక్ష్యాన్ని చేరుకునే మార్గాలపై దృష్టిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు.

స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం వృద్ధి : డేటా అనలిటిక్స్, ఆటోమేషన్, శాఖలతో సమన్వయం, ఎగవేతలపట్ల అప్రమత్తత, సమర్థతను పెంచుకునే పద్ధతుల ద్వారా పనితీరును మెరుగుపరుచుకుంటున్నట్లు తెలిపారు. యంత్రాంగంలో సరైన విధానాలను అమలు చేయడం ద్వారా సమర్థత గణనీయంగా పెరుగుతుందని, దీనివల్ల లీకేజీలు అరికట్టడమే కాకుండా పన్ను చెల్లింపుదారులకు చక్కటి సేవలు అందుతాయని, తద్వారా ఆదాయాలు పెరుగుతాయని సీఎం తెలిపారు. వీటిపై దృష్టి పెట్టాలని సూచించారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం వృద్ది చెందినట్టుగా తెలిపిన అధికారులు.. గత ఐదేళ్లుగా క్రమంగా ఈ శాఖ ఆదాయం పెరుగుతూ వస్తున్నట్లు తెలిపారు. 2018-19 లో ఈ శాఖ ఆదాయం 4725 కోట్లు కాగా, 2022-23 నాటికి ఆదాయం 8071 కోట్లకు చేరినట్లు వివరించారు. గనులు ఖనిజాల శాఖలో 2022-23 సంవత్సరంలో 4500 కోట్లు లక్ష్యం కాగా, 4,756 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 26శాతం వృద్ధి సాధించామని, ఈ ఏడాది 6వేలకోట్ల మేర ఆదాయ లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు తెలిపారు. 2018-19లో రవాణాశాఖలో ఆదాయం రూ.3224.98 కోట్లు ఉండగా.. 2022-23లో ఆదాయం 4294.12 కోట్లు వచ్చినట్లు తెలిపారు. 95.42శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు.

బహిర్గతం కానీ మద్యం ఆదాయం : ఈ ఆర్థిక సంవత్సరం లో 6999.42 కోట్ల లక్ష్యంగా పెట్టుకున్నామన్న అధికారులు తెలిపారు. అన్ని శాఖల ఆదాయాన్ని వెల్లడించినా.. మద్యం ద్వారా ఎంత ఆదాయం వచ్చిందనే విషయాన్ని మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. 2018-19తో పోలిస్తే 2022-23లో 57.87శాతం తక్కువగా బీరు వినియోగం తగ్గినట్లు అధికారులు తెలిపారు. మద్యం అమ్మకం ద్వారా రాష్ట్రానికి ఎంత ఆదాయం వచ్చిందనే విషయాన్ని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఎక్కడా వెల్లడించలేదు.

ఇవీ చదవండి :

Last Updated : Apr 22, 2023, 6:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.