ETV Bharat / state

1 నుంచి 10 తరగతుల వరకు టీవీ పాఠాలు

ఒకటో తరగతి నుంచి పదొ తరగతి విద్యార్థులకు రేపటి నుంచి దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా పాఠాలు ప్రసారం చేయనున్నారు. సందేహాల నివృత్తి కోసం వారానికోసారి ఉపాధ్యాయులు పాఠశాలలకు రానున్నారు.

classes starts in dd sapthagiri
టీవీ తరగతులు
author img

By

Published : Jun 9, 2020, 9:00 AM IST

కరోనా వైరస్ వ్యాప్తి వలన విద్యార్థుల బోధనకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రేపటి నుంచి 1-10తరగతులకు దూరదర్శన్‌ సప్తగిరి ఛానల్‌ ద్వారా పాఠాలు ప్రసారం చేయనున్నారు. 1-5 తరగతులకు బ్రిడ్జి కోర్సు, 6-9 తరగతులకు సబ్జెక్టు పాఠాలను బోధిస్తారు. పిల్లలకు వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు వారానికోసారి ఉపాధ్యాయులు పాఠశాలలకు రానున్నారు. టీవీ పాఠాలపై ఏవైనా సందేహాలు వస్తే విద్యార్థులు ఆ రోజుల్లో పాఠశాలలకు రావచ్చు.

1-5 విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్రిడ్జి కోర్సు పుస్తకాలను నేడు వారికి అందించనున్నారు. ఆంగ్ల మాధ్యమం విధానంలోనే ఆంగ్లం, గణితం, తెలుగు సబ్జెక్టులు బోధిస్తారు. 1, 2 తరగతులకు ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటలు, 3, 4, 5 తరగతులకు 11.30 గంటల నుంచి 12 గంటల వరకు తరగతులు ఉంటాయి. 6-9 తరగతులకు అన్ని సబ్జెక్టులను బోధిస్తారు.

6, 7 తరగతులకు మధ్యాహ్నం 2గంటల నుంచి 3గంటల వరకు, 8, 9 తరగతులకు మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు ప్రసారమవుతాయి. జూన్‌ నెల చివరి వరకు ఈ తరగతులు నిర్వహిస్తారు. పదోతరగతి విద్యార్థులకు ప్రస్తుతం నిర్వహిస్తున్న రెండు గంటల కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.

  • 1-5 తరగతులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ నెల 16 నుంచి ప్రతి మంగళవారం పాఠశాలకు హాజరుకావాలి.
  • 6-7 తరగతుల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు 17వ తేదీ నుంచి ప్రతి బుధవారం పాఠశాలలకు వెళ్లాలి.
  • 8-9 తరగతులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు 19 నుంచి ప్రతి శుక్రవారం పాఠశాలకు హాజరు కావాలి.
  • పదో తరగతి ఉపాధ్యాయులు ప్రతి బుధవారం, శుక్రవారం బడులకు వెళ్లాల్సి ఉంటుంది.

ఉపాధ్యాయులు విద్యార్థుల వర్క్‌షీట్లను మూల్యాంకనం చేయాలి.

ఇదీ చదవండి: అహోబిలం రహదారిపై అడ్డంగా కూర్చొన్న చిరుత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.