గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. పాత కక్షలతో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ దాడిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు స్థానికులు తరలించారు. బాధితులను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్షతగాత్రుల వద్ద వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: