ETV Bharat / state

వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య శిలాఫలకాల చిచ్చు - godava

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిమర్రు గ్రామంలో వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య చిచ్చు రాజుకుంది. తెదేపా ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలను వైకాపా కార్యకర్తలు తొలగించారన్న ఆరోపణలతో.. తెదేపా నేతలు ఆగ్రహించారు.

వైకాపా, తెదేపా శ్రేణులు మధ్య శిలాఫలకాల చిచ్చు
author img

By

Published : Jun 6, 2019, 7:29 PM IST

వైకాపా, తెదేపా శ్రేణులు మధ్య శిలాఫలకాల చిచ్చు

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిమర్రు గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య వివాదం జరిగింది. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను కొందరు వైకాపా శ్రేణులు తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల శ్రేణులు ఘర్షణకు దిగాయి. ఇరు పార్టీలకు చెందిన ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వైకాపా శ్రేణులు శిలాఫలకాలను పూర్తిగా ధ్వంసం చేశారు. గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న నరసరావుపేట రూరల్ పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

ఇదీ చదవండి

''ప్రాజెక్టుల ఖర్చు.. కాంట్రాక్టుల మంజూరుపై విచారణ చేస్తాం''

Intro:ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి డిమాండ్ చేశారు .గురువారం ఆయన పార్టీ కార్యాలయంలో లో మాట్లాడుతూ సత్యసాయి జిల్లా ఏర్పాటుకు పుట్టపర్తిలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా సాధనకై పార్టీలకతీతంగా పోరాడుతామన్నారు కోట్లాది రూపాయల వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని ఆయన కోరారు ఎన్నికల సమయంలో లో జగన్ ఇచ్చిన హామీలన్నిటినీ తప్పకుండా అమలు చేయాలన్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తామన్నారు.

Body:ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలి

Conclusion:పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.