గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలోని ముప్పరాజువారిపాలెంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలోని అధికార పార్టీకి చెందిన ఇరువర్గాలు గోడ హద్దు విషయంలో ఘర్షణకు దిగారు.
ఈ వివాదంలో ముప్పరాజు గోవిందయ్య వర్గానికి చెందిన కొందరు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వ్యక్తి తలకు తీవ్ర గాయాలు కావడంతో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని వినుకొండ రూరల్ సీఐ సుబ్బారావు తెలియజేశారు.
ఇదీ చదవండి: