గుంటూరు నగరానికి సరఫరా అయ్యే తాగు నీటి విషయంలో అత్యంత జాగత్త్ర వహించాలని నగర కమిషనర్ చల్లా అనురాధ.. సంబంధిత సిబ్బందికి సూచించారు. నిన్న స్థానిక తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ ని తనిఖీ చేసి తాగు నీటి సరఫరా, ఆలం, క్లోరినేషన్, కృష్ణా నది నుంచి వచ్చే నీటి శుద్ధి, నీటి నాణ్యతా ల్యాబ్ లను తనిఖీ చేశారు. తాగునీటి శాంపిల్స్ నివేదికలు రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు.
ల్యాబ్ లో సిబ్బంది ఎప్పటికప్పుడు విధుల్లో ఉండేలా చూడాలని, ఇతరులు ప్రాంగణంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిల్టర్ బెడ్స్ ని నిర్ధేశిత పద్ధతిలో శుభ్రం చేస్తుండాలని. ప్రతి రోజు కృష్ణా నది నుంచి వచ్చే నీరు, శుద్ధి చేసి నగరంలోని రిజర్వాయర్ లకు పంపింగ్ చేసే నీటి పరిమాణం, శుద్ధికి వినియోగించిన ఆలం, క్లోరిన్ వివరాలు కూడా క్రమపద్ధతిలో రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. డీఈఈ ప్రత్యేక శ్రద్ధతో అధిక సమయం హెడ్ వాటర్ వర్క్స్ లోనే ఉండి పర్యవేక్షణ చేయాలన్నారు.
ఇదీ చదవండి: