భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులు తొలగించేందుకు కొద్ది రోజుల పాటు ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని సీఐటీయు గుంటూరు కార్యదర్శి నికల్సన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి ఇబ్బందులు ప్రభుత్వానికి తెలియజేసేందుకు మంగళవారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులను సంఘటితం చేసేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆకలియాత్రలు చేపట్టినట్లు నికల్సన్ పేర్కొన్నారు. గత ఐదు నెలలుగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు రూ.10 వేల పరిహారంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అన్నారు.
ఇదీ చూడండి: