గుంటూరులోని మారుతినగర్లో నివాసముంటున్న జయశ్రీ తన కూతురుని ఓ ఆటో డ్రైవర్‌కు ఇచ్చి 8 ఏళ్ల క్రితం పెళ్లి చేశారు. ఆ జంటకు ఇద్దరు సంతానం. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను కడతేర్చాడు ఆటో డ్రైవర్. పిల్లలిద్దరూ అన్యాయం అయ్యారు. తల్లి మృతి చెందిన పరిస్థితుల్లో పిల్లల ఆలనా పాలన చూసే వారు కరవయ్యారు. పిల్లల కోసం కూలి పనిచేస్తూ భోజనం పెడుతున్నట్లు చిన్నారుల అమ్మమ్మ తెలిపింది. వారిని చూడడానికి ఎవరూ ముందుకు రాలేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. న్యాయం చేయాలంటూ బాధితురాలు గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో మీకోసం కార్యక్రమంలో ఎస్పీకి విన్నవించుకుంది.
కూలి పని చేస్తూ పిల్లలకు భోజనం పెడుతున్నా! - undefined
ఆడుతూ పాడుతూ గడపాల్సిన చిన్నారులు తల్లిదండ్రులు క్షణికావేశంతో రోడ్డుపాలు అవుతున్నారు. తల్లిదండ్రుల కుటుంబ కలహాలు చిన్నారుల భవిష్యత్‌ను అంధకారంలో పడేస్తున్నాయి.
గుంటూరులోని మారుతినగర్లో నివాసముంటున్న జయశ్రీ తన కూతురుని ఓ ఆటో డ్రైవర్‌కు ఇచ్చి 8 ఏళ్ల క్రితం పెళ్లి చేశారు. ఆ జంటకు ఇద్దరు సంతానం. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను కడతేర్చాడు ఆటో డ్రైవర్. పిల్లలిద్దరూ అన్యాయం అయ్యారు. తల్లి మృతి చెందిన పరిస్థితుల్లో పిల్లల ఆలనా పాలన చూసే వారు కరవయ్యారు. పిల్లల కోసం కూలి పనిచేస్తూ భోజనం పెడుతున్నట్లు చిన్నారుల అమ్మమ్మ తెలిపింది. వారిని చూడడానికి ఎవరూ ముందుకు రాలేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. న్యాయం చేయాలంటూ బాధితురాలు గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో మీకోసం కార్యక్రమంలో ఎస్పీకి విన్నవించుకుంది.
TAGGED:
childrens