ETV Bharat / state

లంచాలు పోవాలి... మద్య నిషేధం జరగాలి: సీఎం

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్ర ఖజానాకు ఆదాయం తగ్గిందని పలు శాఖల అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఆదాయం తగ్గినప్పటికీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పారదర్శకతను పెంచాలని దిశానిర్దేశం చేశారు.

author img

By

Published : Aug 28, 2019, 5:33 PM IST

జగన్
సీఎం జగన్ సమీక్ష

ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో
వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికం ఇప్పటికే ముగిసినందున రాష్ట్ర ఆర్థిక పరిస్ధితిపై సీఎం సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితులను విభాగాల వారీగా అధికారులు సీఎంకు నివేదించారు.

ఖజానాకు తగ్గిన ఆదాయం
వాణిజ్య పన్నుల్లో 14శాతం వృద్ధి ఉండాల్సి ఉండగా 5.3శాతానికి తగ్గిందని ముఖ్యమంత్రికి సమర్పించిన నివేదికలో అధికారులు తెలిపారు. గడచిన నాలుగు నెలల్లో ఆదాయంలో అనుకున్నంత మేర వృద్ధి లేదని స్పష్టం చేశారు. స్టీల్, ఐరన్‌ రేట్లు కూడా తగ్గడం ఆదాయంపై ప్రభావం చూపుతోందని తెలిపారు. సిమెంట్ రేటు కూడా తగ్గడం వల్ల దానిమీద వచ్చే పన్నులు తగ్గుతున్నాయని తెలిపారు. వాహన రంగంలో మందగమనంతో జీఎస్టీ తగ్గిందని సీఎంకు వివరించారు. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆదాయాలు మెరుగుపడతాయన్న ఆశాభావంతో ఉన్నట్లు అధికారులు తెలిపారు. జీఎస్టీ పరిహారం కింద వచ్చే నెల మొదటివారంలో రూ.597కోట్లు వస్తుందని ...
వాణిజ్య పన్నుల్లో 14శాతం వృద్ది ఉంటుందని సీఎంకు తెలిపారు.

మద్యం దుకాాణాల ద్వారా 16వేల ఉద్యోగాలు
2018–2019లో 125 లక్షల కేసుల లిక్కర్‌ విక్రయం జరిగినట్లు సీఎంకు ఆ శాఖ అధికారులు తెలిపారు. బెల్టుషాపుల ఏరివేతతో 2019 జులై వరకూ 12 లక్షల కేసుల వినియోగం తగ్గిందని తెలిపారు. ప్రైవేటు దుకాణాలు తొలగింపునకు రంగం సిద్ధం చేసినట్లు సీఎంతో చెప్పారు. మొత్తం 20శాతం దుకాణాలు తగ్గించబోతున్నట్లు తెలిపారు. మద్య నియంత్రణ, నిషేధం, డీఎడిక్షన్‌ సెంటర్ల ఏర్పాటుకు నిధులు పెంచుతున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 1 నుంచి పైలట్‌ ప్రాజెక్టు కింద 503 దుకాణాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు సీఎంకు తెలిపారు. మద్యం దుకాణాల ఏర్పాటు ద్వారా 16వేల ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి సీఎం పలు ఆదేశాలు జారీ చేశారు.

మద్యం నియంత్రణపై సీఎం ఆదేశాలు
మద్య నియంత్రణ, నిషేధం అమలుకు ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసు విభాగాలను మరింత బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. స్మగ్లింగ్‌, నాటు సారా వంటివి లేకుండా చూడాలని చెప్పారు. మద్యం అనర్థాలను పాఠ్యప్రణాళికలో ఉంచాలని సీఎం ఆదేశించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు మద్య నియంత్రణ, నిషేధంపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. మద్య నిషేధం అమలుకు గ్రామ సచివాలయంలో మహిళా పోలీసులను వినియోగించాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో లంచాల వ్యవస్థ ఉండకూడదన్న సీఎం జగన్.. అధ్యయనం చేసి ఒక మార్గదర్శక ప్రణాళికను తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో లో సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ మొదలైంది ఎటువంటి సమస్యలు సంఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శివశంకర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు.8008574248.

Body:ఆమదాలవలసలో ప్రశాంతంగా పోలింగ్

Conclusion:8008574248.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.