గుంటూరు జిల్లా ఆత్మకూరులో నూతనంగా నిర్మిస్తున్న తెదేపా ప్రధాన కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. నిర్మాణ పనుల ప్రారంభం తర్వాత తొలిసారి వచ్చిన చంద్రబాబుకు...స్థానిక నేతలు స్వాగతం పలికారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు పనుల పురోగతిని వివరించారు. 4.67 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కార్యాలయాన్ని... షీర్‌వాల్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు. కార్యకర్తలతో సమావేశం కోసం ప్రత్యేక గదుల నిర్మాణం చేపడుతున్నారు. ఒకేసారి 1,200 మంది సమావేశం అయ్యేలా రూపొందించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నాయకులు, కార్యకర్తల విశ్రాంతి కోసం ప్రత్యేక గదులు నిర్మిస్తున్నారు. వ్యాయామశాల, నిత్య భోజన సదుపాయమూ ఉండేలా నిర్మాణం చేపడుతున్నారు.
తెదేపా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన చంద్రబాబు - గుంటూరు జిల్లా
గుంటూరు జిల్లా ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి సందర్శించారు.