![chandrababu tweets](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5916159_babu.jpg)
హిందూపురంలో బాలకృష్ణ కాన్వాయ్‌పై దాడిని చంద్రబాబు ఖండించారు. విశాఖలో తెదేపా కార్యాలయాన్ని కాగడాలతో చుట్టుముట్టడమేంటని మండిపడ్డారు. జగన్ అవినీతి గురించి దేశం మొత్తం తెలిసిపోయిందన్న చంద్రబాబు... ఉక్రోషం పట్టలేకే దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వేలాది మందికి ఉపాధి కల్పించిన తాము ద్రోహులమా? లేక.. కియా యాక్సిలరీ యూనిట్లు పుణెకు తరిమేసిన వైకాపా వాళ్లు ద్రోహులా? అంటూ ప్రశ్నించారు. సభ్యత్వం ఇవ్వని క్లబ్బుల భూములకే ఎసరు పెడుతున్నారన్నారు. ముడుపులు - వాటాలు ఇవ్వని కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కబ్జా చేయడమేనా విశాఖకు చేస్తున్న మేలు? అని ప్రశ్నించారు. ప్రాంతీయ విద్వేషాలు రగిల్చి రాష్ట్రాన్ని వైకాపా అగ్నిగుండం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.