ETV Bharat / state

వర్షంలోనూ... వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన - తెదేపా అధినేత చంద్రబాబు

వరద బాధిత ప్రాంతాల్లో తెదేపా జాతీయ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. జోరువానలోనూ.. యాత్రను ఆపకుండా బాధితులను కలిశారు. అధైర్యపడొద్దని.. అంతా చక్కబడేవరకూ బాధితుల తరఫున తెదేపా పోరాడుతుందని భరోసా ఇచ్చారు.

chandrababu
author img

By

Published : Aug 21, 2019, 5:06 PM IST

వర్షంలోనూ... వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

జోరు వానలో తడుస్తూనే తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. వరద బాధితులను కలుస్తున్నారు. అధైర్యపడవద్దని అండగా నిలుస్తున్నారు. వేమూరు పరిధిలో పర్యటిస్తుండగా.. వర్షం కురిసినా.. ఆయన తన పర్యటన ఆపలేదు. బాధితులను ఓదారుస్తూ ముందుకు కదిలారు. వరద బాధితులు సైతం.. తమ ఇబ్బందులను చంద్రబాబుకు చెప్పాలని ఆరాటపడ్డారు. ఈ వరదలు.. ప్రకృతి తెచ్చిన ముప్పు కాదన్న చంద్రబాబు.. ప్రభుత్వమే తెచ్చిందని ఆగ్రహించారు. వరద వచ్చి వారం దాటినా.. ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదని విమర్శించారు. రిజర్వాయర్లు అన్ని ఖాళీగా ఉన్నా నిల్వ చేసుకునే ఎందుకు చేయలేదన్నారు. ఓ పద్దతి ప్రకారం నీరు వదలితే ఇబ్బంది వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. వరద ముప్పు పూర్తిగా తొలగేవరకూ.. తాను బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Intro:kit 736

కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజక వర్గం
సెల్.9299999511.

కృష్ణాజిల్లా, అవనిగడ్డ నియోజక వర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మరియు వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు

వరదల ప్రభావంతో నీటమునిగిన పసుపు, అరటి, కంద, బొప్పాయి పంటలను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు పులిగడ్డ లో వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు

వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికీ అధికారులు పంట నష్టం పై అంచనాలు తయారు చేస్తున్నారని తెలిపారు. రైతుకు అండగా ఉండాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయం అని , తమపార్టీ ఎప్పుడు రైతు పక్షపాతి గానేఉంటామని తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు వరదలు సృష్టించారు అనడం హాస్యాస్పదం అని ఆయన తెలిపారు, చంద్రబాబు రైతుల బాధలు వినకుండా వరదతో తన ఇంటినిముంచారు అనడం సిగ్గుచేటు అని తెలిపారు.

వరదల వల్ల నష్టపోయిన రైతులందరికి మినుము, మొక్కజొన్న, కంది ఇతర విత్తనాలు వంద శాతం సబ్సిడీపై త్వరలో రైతులకు అందిస్తామని ఆయన తెలిపారు.

వాయిస్ బైట్స్

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

Body:వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వ్యవసాయ శాఖ మంత్రి

Conclusion:వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వ్యవసాయ శాఖ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.