రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనపోయి...విధ్వంస పాలన సాగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జిల్లా, నియోజకవర్గ, మండల తెదేపా నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల ఎస్పీలకు, కలెక్టర్లకు బలవంతపు ఉపసంహరణలపై ఫిర్యాదు చేయాలని పిలపునిచ్చారు. ఎస్ఈసీ కి సామాజిక వర్గం ఆపాదించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల వద్దనున్న సాక్ష్యాలను ఎన్టీఆర్ భవన్‌కు పంపాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి...ప్రాణాలను సైతం లెక్కచేయమన్న తెదేపా నేతల సందేశాన్ని కొనియాడారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా చూపాలని నేతలకు దిశానిర్దేశంచేశారు. పార్టీ మారేవాళ్లు చరిత్రహీనులుగా మిగులుతారని దుయ్యబట్టారు. జడ్జిని నిందించడాన్ని ప్రజలే చూస్తున్నారన్న చంద్రబాబు..., కండిషన్ బెయిల్ లోని నిందితులు రాజ్యాంగ వ్యవస్థ అధిపతిని దూషిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి: మహారాష్ట్రలో మరో కరోనా అనుమానితుడి మృతి