ETV Bharat / state

Chandrababu: చిరంజీవికి చంద్రబాబు ఫోన్.. ఎందుకంటే

chandrababu
chandrababu phone call to chiranjeevi
author img

By

Published : Sep 13, 2021, 7:16 PM IST

Updated : Sep 13, 2021, 7:32 PM IST

19:13 September 13

chandrababu phone call to chiranjeevi

మెగాస్టార్ చిరంజీవికి తెదేపా అధినేత చంద్రబాబు ఫొన్ చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న హీరో సాయిధరమ్​తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కోలుకుంటున్నారు: వైద్యులు

రోడ్డు ప్రమాదంలో గాయపడిన సినీ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ క్రమంగా కోలుకుంటున్నారని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశారు. ‘‘సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వెంటిలేటర్‌ అవసరం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతానికి ఐసీయూలోనే అతడికి చికిత్స అందిస్తున్నాం’’ అని అపోలో ఆస్పత్రి వర్గాలు బులిటెన్‌ విడుదల చేశాయి.

శుక్రవారం రాత్రి స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయితేజ్‌ ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయన తీవ్రగాయాలు అయ్యాయి. హైదరాబాద్​లోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మెడికవర్‌లో ప్రాథమికి చికిత్స అనంతరం ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించారు. 

ఇదీ చదవండి

ప్రభుత్వమే మాంసం విక్రయిస్తుందనే ప్రచారం సరికాదు: మంత్రి సీదిరి

Last Updated : Sep 13, 2021, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.