ETV Bharat / state

Chandrababu Delhi Tour: సోమవారం దిల్లీకి చంద్రబాబు.. రాష్ట్రపతి సమయం ఖరారు - దిల్లీకి చంద్రబాబు తాజా వార్తలు

Chandrababu Delhi Tour
Chandrababu Delhi Tour
author img

By

Published : Oct 22, 2021, 8:16 PM IST

Updated : Oct 22, 2021, 8:57 PM IST

20:13 October 22

చంద్రబాబు బృందానికి రాష్ట్రపతి సమయం ఖరారు

తెదేపా అధినేత చంద్రబాబు దిల్లీ పర్యటన ఖరారైంది. సోమవారం పార్టీ నేతలతో కలిసి హస్తినకు బయల్దేరనున్నారు. చంద్రబాబు బృందానికి రాష్ట్రపతి సమయం ఖరారైంది. ఏపీలో నెలకొన్న పరిణామాలను వివరించటంతో పాటు.. ఆర్టికల్ 356 ప్రయోగించాలని కోరనున్నారు. పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర ప్రముఖులను కలవనున్నారు.  తెదేపా కార్యాలయాలపై వైకాపా దాడులను నిరసిస్తూ  ‘ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం’ పేరుతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు 36 గంటల దీక్ష చేశారు. దీక్ష ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా తీరుపై మండిపడ్డారు. మాది ధర్మపోరాటం.. ముమ్మాటికీ విజయం తమదేనని స్పష్టం చేశారు.

‘‘ప్రజా దేవాలయమైన ఎన్టీఆర్‌ భవన్‌పై దాడి చేశారు. ఎన్టీఆర్‌ భవన్‌లో 70లక్షల కార్యకర్తల మనోభావాలు ఉన్నాయి. పోలీసు బెటాలియన్‌ దగ్గరలోనే దాడి జరిగింది. ఏపీలో రూ.లక్ష కోట్ల విలువైన డ్రగ్స్‌ ఉన్నట్టు పత్రికల్లో కథనాలు వచ్చాయి. విదేశాల నుంచి డ్రగ్స్‌ వస్తున్నాయని తెలిసినా పట్టించుకోవడం లేదు.మద్యం రేట్లు భారీగా పెంచారు. రూ.60 మద్యం రూ.200 చేశారు. మత్తుకు బానిసై కొవిడ్‌ వేళ శానిటైజర్లు తాగారు.  అధికారానికి భయపడి సీఎంకు అంతా లొంగిపోవాలా? తెదేపా హయాంలో మద్యం నియంత్రణ పారదర్శకంగా జరిగింది. డ్రగ్స్‌పై తెలంగాణ సీఎం సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామని అక్కడి సీఎం సమీక్ష చేశారు. సీఎం జగన్‌కు డ్రగ్స్‌పై సమీక్ష నిర్వహించే తీరిక లేదా? డీజీపీకి హైకోర్టు అక్షింతలు వేసినా సిగ్గు అనిపించడం లేదా? రాజకీయం కోసం జగన్‌ తల్లిని, చెల్లిని ఉపయోగించుకున్నారు. జైలుకెళ్లినప్పుడు జగన్‌ తన తల్లిని ఊరూరా తిప్పారు. జగన్ తన చెల్లిని జగనన్న బాణం అని యాత్రలు చేయించారు. జగనన్న వదిలిన బాణం ఇప్పుడు తెలంగాణలో తిరుగుతున్నారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని జగన్‌ రాష్ట్రానికేం చేస్తారు? పట్టాభి మాటలకు వైకాపా నేతలు కొత్త అర్థాలు చెబుతున్నారు. వివేకాను నేనే చంపించానని గతంలో జగన్‌ ఆరోపించారు. జగన్‌ ఉన్మాదంతో రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. కోర్టు చీవాట్లు పెట్టినా, మొట్టికాయలు వేసినా పట్టించుకోని దుర్మార్గుడు జగన్‌. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ బూతులు మాట్లాడలేదు. సీఎంగా ఉన్నప్పుడు అమరావతికి బస్సులో వెళ్లిన నాపై దాడి చేయించారు. ఫోన్‌లో మాట్లాడేందుకు గవర్నర్‌, కేంద్ర హోం మంత్రికి సమయం దొరికినా డీజీపీకి టైమ్‌ దొరకలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉగ్రవాదానికి లొగిపోవాలా? ఉక్కు సంకల్పంతో కార్యకర్తలు పోరాటానికి సిద్ధం కావాలి. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే కమిషన్‌ వేస్తా. రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిన వారు ఎక్కడ దాక్కున్నా చట్ట ప్రకారం శిక్షిస్తాం" - చంద్రబాబు, తెదేపా అధినేత 

ఇదీ చదవండి

TDP Fire On YCP:సవాంగ్ డీజీపీ కాదు.. 'డీజేపీ'.. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది: తెదేపా

Last Updated : Oct 22, 2021, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.