Chandrababu Letter to PM Modi to Help Cyclone Affected Farmers: తెలుగుదేశం అధినేత చంద్రబాబు సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టి మిగ్‌జాం తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. తుపానుతో రైతులు నష్టపోయి ఆపదలో ఉంటే ప్రభుత్వం ఆదుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నాలుగేళ్లుగా మురుగుకాల్వల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేయడంతో పొలాల్లోకి నీరు చేరి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఇంత జరిగినా ప్రభుత్వం నష్టం అంచనా వేయకపోవడం దారుణమని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు.
రైతు కష్టాలు పట్టించుకోని సీఎంను దేవుడు కూడా క్షమించడు : చంద్రబాబు
తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ (Chandrababu Letter to Modi) రాశారు. తుపాను వల్ల నష్టపోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని అన్నారు. రాష్ట్రంలో మెత్తం 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని లేఖలో తెలిపారు. తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని, తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం చేయాలని కోరారు. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపిందని 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు ప్రజల జీవనాన్ని దెబ్బతీశాయని అన్నారు. తుపాను కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఆరుగురి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవాలని అన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, మొత్తంగా 10 వేల కోట్ల రూపాయల వరకు పంట నష్టం ఉంటుందని అన్నారు.
అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు రేవంత్ రెడ్డి! ఇసుకతో బొమ్మలు వేస్తావా ? కళకారుడికి పోలీసుల బెదిరింపులు
పంటలు దెబ్బతినడంతో పాటు పలు చోట్ల పశువులు చనిపోయాయి, చెట్లు విరిగిపడ్డాయి. దాదాపు 770 కి.మీల మేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. తాగునీరు, నీటిపారుదల, విద్యుత్, కమ్యూనికేషన్ రంగాలకు నష్టం జరిగింది. అంతే కాకుండా వ్యవసాయంతో పాటు ఆక్వా రంగం కూడా నష్టపోయిందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. తుపాను వల్ల పంట నష్టపోయి ఆవేదనతో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. తీవ్ర గాలుల ప్రభావంతో మత్స్యకార పడవలు, వలలకు భారీగా నష్టం జరిగి వారు జీవనోపాధి కోల్పోయారని వారికి అండగా నిలవాలని లేఖలో తెలిపారు.
జగన్‌కు ఉల్లిగడ్డ, ఆలుగడ్డకు తేడా తెలియదు - రైతు కష్టాలు ఎలా తెలుస్తాయి?: చంద్రబాబు
తుపాను ప్రభావం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాలేదు. పొరుగున ఉన్న తమిళనాడుపై కూడా ప్రభావం చూపిందని చంద్రబాబు తెలిపారు. తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జరిగిన నష్టాన్ని అంచనా వేసి 'జాతీయ విపత్తు'గా ప్రకటించాలని కోరుతున్నాని మోదీకి తెలిపారు. తుపాను నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం బృందాన్ని పంపాలని కోరుతున్నానని పేర్కొన్నారు. జాతీయ విపత్తుగా ప్రకటిస్తే తక్షణమే మెరుగైన సహాయం బాధితులకు అందుతుంది. మీ ప్రకటన ద్వారా తుపాను బాధితులలో విశ్వాసాన్ని నింపే అవకాశం ఏర్పడుతుందని లేఖలో స్పష్టంగా చంద్రబాబు పేర్కొన్నారు.