ETV Bharat / state

'ప్రభుత్వ ప్రతి ఆలోచనలో ప్రజలను మోసం చేసే కుట్ర' - ysrcp

ప్రభుత్వం ప్రతి ఆలోచనలో ప్రజలను మోసం చేసే కుట్ర ఉండాల్సిందేనా అంటూ తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆశావర్కర్లను ప్రభుత్వం మోసం చేసిందని ఆయన అన్నారు. 10 వేల రూపాయలు జీతం పెంచామని చెప్పి...ఫోటోలకు ఫోజులిచ్చి..మరో పక్క ఉద్యోగం నుంచి తీసేసే జీవో ఇవ్వడంపై ఆయన ధ్వజమెత్తారు.

chandrababu-fire-on-ycp
author img

By

Published : Aug 26, 2019, 4:03 PM IST

ఆశా వర్కర్లను ప్రభుత్వం మోసం చేస్తోందంటూ తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ ప్రతి ఆలోచనలో ప్రజలను మోసం చేసే కుట్ర ఉండాల్సిందేనా అని దుయ్యబట్టారు. ఆశావర్కర్లకు 10 వేల రూపాయల జీతం పెంచేశామంటూ ఫోటోలకు ఫోజులిచ్చి.. మరో పక్క ఏకంగా ఉద్యోగం నుంచి తీసేసే జీవో ఇవ్వడంపై ఆయన ధ్వజమెత్తారు. వాళ్ళ కష్టానికి గ్రేడులేంటని ప్రశ్నించిన చంద్రబాబు.. చిన్న చిన్న ఉద్యోగులపై ఇలాంటి థర్డ్ గ్రేడ్ కుట్రలు ఎలా చేయగలుగుతున్నారంటూ ఆక్షేపించారు. ఇలాంటి దుర్మార్గపు జీవోలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఆశా కార్యకర్తలకు హామీ ఇచ్చినట్టుగా నెలకు 10 వేల రూపాయల జీతం ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలన్నారు. ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలను కూడా పెయిడ్ ఆర్టిస్టులే అని ఏదో ఒక మార్ఫింగ్ కథను వైకాపా వాళ్లు సృష్టిస్తారన్న చంద్రబాబు... ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలోకి వచ్చినా వారికి అది మామూలే అంటూ ట్విట్టర్‌లో మండిపడ్డారు.

chandrababu-fire-on-ycp
చంద్రబాబు ట్వీట్​

Intro:ap_cdp_16_26_asha_workers_deekshalu_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
ఆశ వర్కర్లకు పెండింగ్లో ఉన్న ఎనిమిది నెలల జీతాలు ఇవ్వాలని ఏఐటీయూసీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఆశ వర్కర్లు కడప కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 8 నెలల నుంచి జీతాలు లేక ఆశ వర్కర్లు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పది వేల రూపాయల జీతం ఇస్తామని నమ్మించి ఇప్పుడు గ్రేడ్లు విభజించడం దారుణమని ఖండించారు. ఆశా వర్కర్ల పై రాజకీయ వేధింపులు ఆపాలని, పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. పెంచిన 10,000 రూపాయల జీతం ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆశ వర్కర్లు ఉద్యమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు.

Body:ఆశ వర్కర్ల దీక్షలు

Conclusion:కడప

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.