రాష్ట్రానికి మంచి రోజుల కోసం పవిత్ర మాసంలో అందరూ ప్రార్థించాలని తెదేపా అధినేత చంద్రబాబు ముస్లిం సోదరులను కోరారు. ‘నా పోరాటం పదవి కోసం కాదు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. పేదవారికి అండగా ఉండాలని..’ అని అన్నారు. గుంటూరులో శుక్రవారం ముస్లిం సోదరులకు ఇచ్చిన ఆత్మీయ ఇఫ్తార్ విందులో ఆయన మాట్లాడారు. ముస్లింల అభివృద్ధికి తెదేపా హయాంలో ప్రత్యేక కేటాయింపులు చేశామని గుర్తు చేశారు. పేద ముస్లింలు కూడా రంజాన్‌ను సంబరంగా జరుపుకోవాలని 10 లక్షల కుటుంబాలకు రంజాన్ తోఫా ఇచ్చామని గుర్తుచేశారు. మత పెద్ద జావిద్ సాహెబ్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌కుమార్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పాల్గొన్నారు.
మహానాడు ఏర్పాట్లపై సమీక్ష
తెదేపా మహానాడు ఏర్పాట్లపై చంద్రబాబు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్షించారు. ఒంగోలు సమీపంలోని త్రోవగుంటలో బృందావన్‌గార్డెన్ వెనుక ఉన్న 83 ఎకరాల స్థలంలో మే 27, 28వ తేదీల్లో మహానాడు నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: విజయవాడలో ముస్లింలకు ప్రభుత్వ ఇఫ్తార్ విందు.. పాల్గొన్న సీఎం జగన్