Chandrababu Allegations on CM Jagan: జగన్మోహన్ రెడ్డి ఓ దుర్మార్గుడు 2004లో సీఎం కాకపోవడంతో హైదరాబాద్ బతికిపోయిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో వివిధ నియోజకవర్గాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తెలుగుదేశంలోకి చేరిన సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి జగన్ కంటే 100 రెట్లు నయం కాబట్టి హైదరాబాద్ అభివృద్ధిని నాశనం చేయలేదని అన్నారు. వికృతమైన క్రీడలతో ఆంధ్రాను జగన్ అడిస్తున్నాడని దుయ్యబట్టారు. పద్దతి లేని రాజకీయాలతో ఏపీని రాజధాని లేని రాష్ట్రం చేశాడని మండిపడ్డారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల న్యాయమైన కోరికలన్నీ నెరవేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పరదాలు, పోలీసుల సాయం లేకుండా బయటకు రాలేని దుస్థితి జగన్‌దని విమర్శించారు. డిసెంబర్ 20 తర్వాత 25 నియోజకవర్గాల్లో పర్యటించి, వచ్చే 5 ఏళ్లలో ఏం చేస్తామో చెప్తానని తెలిపారు. సైకో జగన్‌ను చిత్తు చిత్తుగా ఓడిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు - పార్టీ కండువా కప్పి స్వాగతించిన చంద్రబాబు
చిల్లు పడిన వైసీపీ నావ త్వరలోనే మునిగిపోతుంది: జనవరిలో సైకిల్ స్పీడ్ పెరిగి, ఫ్యాన్ రెక్కలు ఇరక్కొడుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చిల్లు పడిన వైసీపీ నావ త్వరలోనే మునిగిపోతుందని 3 నెలల తర్వాత జగన్ ఎక్కడికి పోతాడో తెలీదని అన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ తమ జీవితాలకు భద్రత కోరుకుంటున్నారని అన్నారు. అపరిచితుడు లాంటి జగన్ చెప్పిందేదీ చేయడని మండిపడ్డారు. తల్లీ, చెల్లికి కూడా సమయం ఇవ్వని వ్యక్తి ఇక ఎమ్మెల్యేలకేం ఇస్తాడని విమర్శించారు. రాష్ట్రం మీదకు ఓ అరాచక సైన్యాన్ని జగన్ వదిలిపెట్టాడని చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని కాపాడేందుకే తెలుగుదేశం-జనసేన కలిసి ఎన్నికలకు వస్తున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు.
'విజయనగరం జిల్లాను బి-కంపెనీ అడ్డగోలుగా దోచేస్తోంది - ఖాళీ స్థలం కనబడితే ఖతమే'
ఘనంగా సాగయ్యే పంట గంజాయి మాత్రమే: వైసీపీకి ప్రమాద ఘంటికలు మొగుతున్నాయి. అన్ని సంప్రదాయాలను సర్వ నాశనం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. ఎంత మందిని మార్చినా వైసీపీని ఓడించాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని తెలిపారు. బీసీని గెలిపించాలంటే జగన్ కేటాయించాల్సిన మొదటి సీటు పులివెందుల అని చంద్రబాబు అన్నారు. ఈ ఐదేళ్లలో ఎవరి జీవన ప్రమాణాలు అయినా మారాయా అని ప్రతీ ఒక్కరూ ఆలోచించాలని కోరారు. డీఎస్సీ పెట్టి ఒక్క టీచర్‌కి కూడా ఉద్యోగం ఇవ్వకుండా, విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయని జగన్ ఎలా చెప్తాడని మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి వారికి గంజాయి మాత్రం ఇస్తున్నాడని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఘనంగా సాగయ్యే పంట గంజాయి మాత్రమేనని చంద్రబాబు విమర్శించారు.
వైసీపీకి గడ్డు రోజులు రాబోతున్నాయి - ఈ ప్రభుత్వానికి మహిళల ఉసురు తగులుతుంది : ఎమ్మెల్సీ అనూరాధ
TDP Committees to Fight Public Issues: ప్రజా సమస్యలపై పోరాడేందుకు శాఖల వారీగా 18 కమిటీలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నియమించారు. ఒక్కో కమిటీకి ఒక్కో సీనియర్ నేత పర్యవేక్షించేలా బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయిలో పోరాడేలా కార్యాచరణ రూపొందించే బాధ్యత కమిటీలు తీసుకోవాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రతీ 15 రోజులకోసారి కార్యక్రమాల పురోగతిని సమీక్షించుకుని తదుపరి కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ ఏర్పాట్లను చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిమంది తరలి వస్తున్నందున ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.