అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే ప్రజలను ఇన్ని కష్టాలు పెట్టిన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. వైకాపా పాలనలో అన్నీ వైఫల్యాలేనని చెప్పారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి పేదలు, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు, యువత, మహిళల ఆశలను నీరుగార్చారని... ఇన్ని ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు గతంలో లేవని ఆరోపించారు.
ఆర్థిక సంక్షోభ పరిస్థితి
రాష్ట్రంలో పెట్టుబడులన్నీ వెనక్కిపోయి... రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. వీటన్నిటి పైనా గ్రామాలు, వార్డుల్లో చర్చించాలని నేతలు, కార్యకర్తలను ఆదేశించారు. పార్టీ పటిష్ఠతపై దృష్టి సారించాలని, పంచాయతీ ఎన్నికల్లోపు పార్టీ కమిటీలుగా ఏర్పడాలని నేతలకు సూచించారు. క్షేత్ర స్థాయి కార్యకర్తల్లో ఉత్సాహం మెండుగా ఉందని చంద్రబాబు కితాబిచ్చారు.
ఇదీ చదవండి: