ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదో చీకటి రోజని మూడు రాజధానుల బిల్లుపై తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ అనంతరం బయటకు వచ్చిన చంద్రబాబు ఎమ్మెల్యేలతో కలసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు అమరావతిని చంపాయలనే ఘోరమైన తప్పిదానికి జగన్ శ్రీకారం చుట్టారని దుయ్యబట్టారు. వయసులో చిన్న వాడైనా జగన్‌కు దండం పెట్టి అడిగినా కనికరం లేకుండా వ్యవహరించారని ధ్వజమెత్తారు. మానవ హక్కులు ఉల్లంఘించి మరీ దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగితే సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుకోవాలన్నప్పటికీ స్పందించలేదన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలు ఓ వైపు ఉంటే జగన్ ఒక్కడే ఇంకోవైపు ఉన్నారని దుయ్యబట్టారు. అప్పుడెప్పుడో పిచ్చి తుగ్లక్ రాజధానిని మార్చారని విన్నామని..., ఇప్పుడు అదే తరహాలో జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దీనిని ఇంతటితో వదలమని జేఏసీ తరఫున పెద్దఎత్తున ఉద్యమించి కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని చెప్పారు. రాజధాని ప్రాంతంలో కర్ఫ్యూ వాతావరణం దుర్మార్గమని విమర్శించారు. అరెస్టులు, లాఠీఛార్జ్‌లు చేయడం హేయమని దుయ్యబట్టారు. ఉద్యమాన్ని అణగదొక్కాలని చూస్తే మరింతగా రెచ్చిపోతామని చంద్రబాబు హెచ్చరించారు.
ఇదీ చూడండివిజయవాడ ప్రాంతంలో రాజధాని వద్దని శివరామకృష్ణ కమిటీ చెప్పలేదు'