అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా.. అమరావతిలో నిర్వహిస్తున్న జనభేరి కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి తెదేపా నేతలు, అమరావతి ఐకాస నేతలు పెద్దఎతున్న తరలివెళ్లారు. దారిపొడవునా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినదించారు.
అమరావతి రైతులకు సంఘీభావంగా చలో రాయపూడికి వెళుతున్న నేతలను గృహనిర్బంధం చేయడం దుర్మార్గమైన చర్య అని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. అమరావతిలో జరిగే బహిరంగ సభకు అనుమతి ఇస్తున్నామని నిన్న జిల్లా ఎస్పీ చెప్పి.. నేడు అడ్డుకోవడం సరికాదన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఉద్యమాన్ని ఆపలేరన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం అగదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: పోలీసుల హైడ్రామా మధ్య జనభేరి సభకు చంద్రబాబు!